ఏలూరు, మార్చి , :అమరావతి విజయహాసం :జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలనీ జిల్లా కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి శనివారం జిల్లాలో మట్టి అక్రమ త్రవ్వకాలు, రవాణా నియంత్రణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా చేసేవారిపైకేసులునమోదు చేయాలి ఇరిగేషన్, రెవిన్యూ, పోలీసు సిబ్బందితో బృందాలను ఏర్పాటుచేసి పటిష్టమైన నిఘా పెట్టాలి జిల్లా కలెక్టర్ కె . వెట్రిసెల్వి
*మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష* సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిలాల్లో కాలువలు, చెరువు గట్లు, తదితరాల నుండి అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా తవ్వి, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఆలా చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అక్రమంగా మట్టి తవ్వకాలు కారణంగా కాలువలు, చెరువుల గట్లు బలహీనమవుతాయన్నారు. జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణకు ఇరిగేషన్, రెవిన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యక బృందాలను ఏర్పాటుచేసి, గట్టి నిఘా పెట్టాలని, ఎవరైనా అనుమతి లేకుండా మట్టిని తవ్వి, రవాణా చేస్తే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలన్నారు. రైతులు వారి పొలాలలో అవసరాలకుగాను సంబంధిత తహసీల్దార్ల వద్ద నుండి మే నెలాఖరులోగా అనుమతి తీసుకుని మట్టిని తరలించుకోవచ్చన్నారు.
ఇరిగేషన్ శాఖ ఎస్ఈ దేవప్రకాష్, జిల్లాలోని తహసీల్దార్లు, ఇరిగేషన్, గనులు శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

