భీమడోలు, అమరావతి విజయ హాసం : రైతు సేవా సహకార సంఘం లో సొసైటీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారి అధ్యక్షతన మహాజన సభ జరిగింది.
ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ బధ్య్తతలు తీసుకున్న తరువాత జరిగిన అభివృద్దిన వివరించారు. వ్యాపారం గతం కన్నా 4 కోట్లు పెరిగిందని డిపాజిట్లు దాదాపు 90 లక్షలు పెరిగాయని సంవత్సర నష్టం 1 కోటి నుంచి 22 లక్షల రూపాయల లాభాల కు తీసుకు వచ్చామని అన్నారు. గత 2024 – 2025 సంవత్సరానికి ఎరువల అమ్మకం వలన 11.85 లక్షలు నష్టం రాగా 2025 – 2026 సంవత్సరానికి గాను 55 లక్షలు లాభాలు వచ్చాయని అన్నారు. 2026 – 2027 సంవత్సరానికి భీమడోలు రైతు సేవా సహకార సంఘాన్ని లాభల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఏలూరు డి సి సి బి 96 కోట్ల నష్టాన్ని పూర్తిగా తగ్గించామని ప్రస్తుతం బాంకుకు ఎటువంటి బయట అప్పు లేదని అన్నారు. ఈ సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులు గేదల శ్రీనివాసు, వెజ్జు రాంబాబు బాంకు సి ఇ ఓ నాగేంద్ర, డి సి సి బి బ్రాంచ్ మేనేజర్ సహకార సంఘ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు
ఈ సమావేశం అనంతరం డీ సి సి బి సిబ్బంది కి వేతన సవరణకు అంగీకారం తెలిపినందుకు కృతజ్నతలు తెలియజేసిన డి సి సి బి సిబ్బంది. గన్ని మాట్లాడుతూ బాంకు అభివృద్దికి మరింత సహకారాలు అందించాలని అన్నారు.


