Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ లింగపాలెంమండలంలింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావుఆధ్వర్యంలో టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లింగపాలెం మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు పార్టీ జెండా ఎగరావేశారు.

 


ఏలూరు జిల్లా, అమరావతి విజయహాసం : చింతలపూడి నియోజకవర్గ లింగపాలెంమండలం

లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావుఆధ్వర్యంలో టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  లింగపాలెం మండలంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు పార్టీ జెండా ఎగరావేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ ఆనాడు పేదవాడు గొంతుక తరుపున ఢిల్లీ నాయకులకు  ఎదురొడ్డి పోరాడి గెలిచిన నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు అని అన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  యువ నాయకత్వంలో పార్టీ ముందుండి దూసుకుపోతుందని అన్నారు ప్రతి టీడీపీ కార్యకర్త శక్తి వంచన లేకుండా  స్థానిక సంస్థల ఎన్నికలను  దృష్టిలో ఉంచుకొని పార్టీ గౌరవాన్ని  కాపాడాలని  పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి  యువత కష్టపడి పనిచేయాలని అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నాయకత్వంలో  చింతలపూడి నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని అన్నారు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల పేద ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు  మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు  ఈ సందర్భంగా  ఆనాటి ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమన్ని గురించి  బీసీ సెల్ నాయకులు  పిల్లల శ్రీనివాస్ యాదవ్,ఎస్సీ సెల్ నాయకులు తాడేపల్లి దాసుబాబు వివరించారు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో  పార్టీ అనుబంధ సంఘాలు,నాయకులు, కార్యకర్తలు అభిమానులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.