వాడపల్లి, అమరావతి విజయహాసం :*వాడపల్లి వేంకన్న రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు*తదుపరి స్వామివారి దివ్య రథోత్సవంలో పాలకమండలి ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, పాలకమండలి సభ్యులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు తదితరులతో కల్సి రథోత్సవంలో పాల్గొన్నారు
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి రథోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామివారి దివ్య రథోత్సవంలో పాలకమండలి ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, పాలకమండలి సభ్యులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు తదితరులతో కల్సి రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వాడపల్లి వీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి.

