"దెందులూరు*అమరావతి విజయహాసం :భూమి ఆకాశం ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీశాశ్వతంగా నిలిచే ఉంటుంది - తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే గ్రామాల్లో రాజకీయ చైతన్యం మొదలైంది - పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, సేవా భావం, క్రమశిక్షణ వంటి మహోన్నత నాయకత్వ లక్షణాలు కలిగిన తెలుగుదేశం పార్టీలో పదవులు మాత్రమే కాదు ప్రాధమిక సభ్యత్వం కలిగి ఉండటం కూడా ప్రతి ఒక్కరికి గర్వకారణం - స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ స్ఫూర్తితో, యువ నాయకులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలకు అనుగుణంగా...* *మన తెలుగుదేశం పార్టీని గ్రామ గ్రామాన మరింతగా ప్రజలకు చేరువ చేద్దాం - పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం - ప్రతి పేదవాడి సంక్షేమానికి అండగా నిలుద్దాం" : పెదవేగి మండలం దుగ్గిరాలలో జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు..*
*కార్యక్రమంలో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. అనంతరం మా తెలుగు తల్లి గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని కార్యక్రమాలను వీక్షించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు...*
*తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితా ప్రకారం నియోజకవర్గంలోని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులను ఘనంగా సత్కరించిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు..*
*కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నియోజకవర్గ పరిధిలోని వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు సహా పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు..*
*ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ "ప్రజాక్షేత్రంలో అధికారంలో ఉన్న లేకపోయినా కూడా 44 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు మీ సేవలకు ఎన్నటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులను, ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడగలిగినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ మంచి ముహూర్తాన ఒక మంచి గొప్ప సంకల్పంతో ఈ పార్టీకి శ్రీకారం చుట్టారో గాని ,ఈసారి తో తెలుగుదేశం పార్టీ ముగింపు , పార్టీ అయిపోయింది అని ఎంతోమంది పగటి కలలు కన్నారు గాని తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రతి ఎవరు దాన్ని ప్రతి అడ్డంకులను అధిగమిస్తూ ప్రతిసారి రెట్టింపు బలోపేతంతో రెట్టించిన కార్యకర్తల ఉత్సాహంతో మరింత బలోపేతంగా దేశ రాజకీయాల్లో సైతం ప్రభావాన్ని చూసేంత స్థాయికి ఎదిగింది. ఎదుగుతుంది కూడా.. ఈ భూమి ఆకాశం ఉన్నంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అలా వర్ధిల్లుతూనే ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తున్న.*
*మన తెలుగుదేశం పార్టీనీ స్వర్గీయ ఎన్టీఆర్ గారూ స్థాపించిన తర్వాతే గ్రామాల్లో ఓటు యొక్క విలువ, ఏ విధంగా ఓటు వేయాలి? అసలు అధికారం అంటే ఏంటి? అనేవి ప్రజలకు మరింత అవగాహన కల్పించాయి. అంతకు ముందు వరకు కూడా గతంలో పెత్తందారులు ఉండేవారు, కరణాలు, మునసబులు అంటూ ఓ 10 మంది మోతుబరి రైతులతోనే రాజకీయాలు నడిచేవి. ఈ రాజకీయ చైతన్యాలు, ప్రచారాలు, హంగు ఆర్భాటాలు, సామాన్యుడికి గుర్తింపు వంటివి ఉండేవి కాదు. అటువంటి రాజకీయాల్లో సమూల మార్పు తెచ్చినటువంటి వ్యక్తి మన వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు.*
*తద్వారా నేను ఎమ్మెల్యే అయినా, మీరు సర్పంచ్ గా, వార్డు మెంబర్గా, ఎంపీటీసీగా, జడ్పిటిసిగా, ఎంపీపీగా, చైర్మన్గా, వివిధ హోదాల్లో పార్టీ పదవులు అనుభవిస్తున్న లేక అధికారికంగా నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న అది ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారి పుణ్యమే అని, వారు ఎప్పటికీ చిరస్మరణీయులని అన్నారు. ముఖ్యంగా మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ తెచ్చి బీసీ వర్గాలకు కూడా రిజర్వేషన్ తెచ్చి ఈనాడు జిల్లా పరిషత్ చైర్మన్లు గా, సర్పంచ్ లుగా, ఎంపీపీలుగా కొనసాగారు, కొనసాగుతున్నారు అంటే కూడా అది ఎన్టీఆర్ గారు చూపినటువంటి చొరవ ,తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ అని అన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి మనం మరింతగా తీసుకువెళుతున్నాం కూడా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు సేవలందించారు..వారిలో ఉత్తమ సేవలందించిన కొందరు నాయకులను జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారు ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన జాబితా ఆధారంగా 1) ముళ్ళపూడి.సాంబశివరావు గారు, క్లస్టర్ ఇంచార్జ్, (2) పర్వత నేను శ్రీనివాసరావు గారు, యూనిట్ ఇంచార్జ్ , (3) సుందర్ రావు గారు, మన టిడిపి యాప్ లో యాక్టివ్ కార్యకర్త, (4) ముసునూరు రమేష్ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు, (5) కొనకల్ల ధర్మరాజు గారు, బూత్ కన్వీనర్, (6) దయాల ప్రదీప్ గారు, యూనిట్ ఇంచార్జ్ , (7) వినోద్ గారు , యూనిట్ ఇంచార్జ్, (8)సయ్యద్ ఫరూక్ గారు, మండల ఐటీడీపీ సెక్రటరీ,మైటిడిపై యాప్, (9) శ్రీనివాస్ రావు అనకాపల్లి గారు, మన టిడిపి యాప్ సభ్యులు, (10) బలుసు సుజన్ గారు,ఐటీడీపీ సభ్యులు , (11) పెనుబోయిన మహేష్ యాదవ్ గారు, tnsf మాజీ అధ్యక్షులు పేర్లతో పార్టీ అధిష్టానం నుంచి జాబితా వచ్చిందని వీరందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు తెలిపారు..*
*ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది మీలో ఎంతోమంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పిటిసిలుగా, వివిధ హోదాల్లో రాబోయే రోజుల్లో మీరు పోటీ చేసి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి మంచి విజయాన్ని చేకూర్చాలని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని ముందుగానే అభినందిస్తూ, ఈరోజు మీ మీ గ్రామాల్లో పార్టీ ఆవిర్భావం దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు..*
-------


