చింతలపూడి,
*ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోపకారి,మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనది... భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని MLA రోషన్ కుమార్ పేర్కొన్నారు*
*శ్రీరాముని ఆశీస్సులతో నియోజవర్గంలో అభివృద్ధి సంక్షేమం కలగలసి ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తన స్వగ్రామమైన ధర్మాజీగూడెంలో MLA రోషన్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు*
*కోదండరామాలయం నకు పట్టు వస్త్రాలు సమర్పించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమర్పించారు....*
శ్రీరామనవమి కల్యాణ మహోత్సవం సందర్భంగా ధర్మాజీగూడెం గ్రామంలో హైస్కూల్ రోడ్డులో శ్రీ సీతారామాంజనేయ ఆలయం, తూర్పువీధిలో సీతారామాలయం, పడమట వీధిలో కోదండ సీతారామాలయం, కాటమ రెడ్డిపల్లిలో రామాలయంలను చింతలపూడి శాసన సభ్యులు సొంగ రోషన్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు, మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం ఉండాలని తెలియజేసారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

