*గోల్డ్ మెడల్స్ సాధించిన రిషితాను అభినందించిన ఎమ్మెల్యేరోషన్ కుమార్**తిరుపతిలోని వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో 9 గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ రాష్ట్ర గవర్నర్ నజీర్ చేతుల మీదుగా అందుకున్న చింతలపూడి పట్టణానికి చెందిన విద్యార్థిని రిషితాను చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అభినందించారు*
. *ఈ మేరకు దుస్సాలువాతో రిషితాను సత్కరించారు*
*కారుమంచి రిషిత గన్నవరంలోని వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కోర్సు నందు గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అందుకోవడ పట్ల రిషిత తల్లిదండ్రులు కారుమంచి ప్రకాష్ , హేమలతలను కూడా ఎమ్మెల్యే అభినందించారు*.

