Ticker

6/recent/ticker-posts

గన్నవరం మండలంసూరంపల్లి,గన్నవరంనియోజకవర్గఅభివృద్ధికి రూ. 386 కోట్ల బడ్జెట్ కేటాయింపు : రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు**సూరంపల్లిలో 'ప్రజా దర్బార్' నిర్వహించి, ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే*





గన్నవరం మండలంసూరంపల్లి,గన్నవరంనియోజకవర్గఅభివృద్ధికి రూ. 386 కోట్ల బడ్జెట్ కేటాయింపు :   రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు**సూరంపల్లిలో 'ప్రజా దర్బార్' నిర్వహించి, ప్రజల నుండి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే*

అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవారం గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత సూరంపల్లి గ్రామంలో రూ. 21 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ గాంధీ మహర్షి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సులభంగా అందించడం ద్వారా సహకార రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కేంద్రం రైతులకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో పాల్గొని, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ‘బడ్జెట్ అవుట్‌రీచ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గానికి ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 386 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి రూ. 82 కోట్లు, మహిళా మరియు శిశు సంక్షేమానికి రూ. 38 కోట్లు, విద్యారంగానికి రూ. 20 కోట్లు, పశుసంవర్ధక మరియు ఉద్యానవన శాఖలకు చెరో రూ. 9 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ‘స్వర్ణాంధ్ర @ 2047’ లక్ష్యంగా 15% వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కృష్ణా జిల్లా ఆర్థిక వ్యవస్థలో గన్నవరం నియోజకవర్గం 19% వాటాను కలిగి ఉండటం గర్వకారణమని, వాణిజ్య సేవలు మరియు పశుసంవర్ధక రంగాల్లో నియోజకవర్గం ముందంజలో ఉందని తెలిపారు. ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తూనే, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, గన్నవరం మండల ఎంపీడీవో స్వర్ణలత, గన్నవరం మండల తాసిల్దార్ కె వి శివయ్య, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, సూరంపల్లి గ్రామ పిఎసిఎస్ అధ్యక్షులు గొట్టిపూళ్ళ వీరబాబు, సూరంపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు పామర్తి సాంబశివరావు, మాజీ సర్పంచులు దేవరపల్లి కోటేశ్వరరావు, ఈలప్రోలు వాసు, ఎంపీటీసీ బాణావతు నీలిమ టిడిపి నాయకులు దొంతు చిన్న, రామినీడు బసవపూర్ణయ్య, తోట శ్రీనివాసరావు, మేడేపల్లి రమ, తులిమెల్లి ఝాన్సీ, జాస్తి శ్రీధర్, బండి భాస్కర్, ముద్రబోయిన శ్రీనివాసరావు, బోడపాటి రవికుమార్, మోదుగమూడి సత్యనారాయణ, అన్నే హరికృష్ణ, గొడ్డల్ల చిన్న రామారావు, చల్లగాలి సునీల్, చల్లగుల్ల సందీప్, నల్లూరు వెంకటరత్నం, కొసరాజు సాయిరాం, జొన్నలగడ్డ సుధాకర్, మల్లారెడ్డి కిషోర్, మొవ్వా వేణుగోపాల్, కొమ్మా రెడ్డి రాజేష్, కొల్లూరు చంద్రకాంత్, అట్లూరి శ్రీనివాసరావు, నందేటి తిరుపతయ్య, చిమట రవి వర్మ, పల్లి కార్తీక్, శ్రీనివాస రావు, రాంబాబు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.