Ticker

6/recent/ticker-posts

*మండవల్లి మండలం పలు గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన MLA డా. కామినేని శ్రీనివాస్ గారు*

 13/03/2026 ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు మండవల్లి మండలంలో భైరవపట్నం, మండవల్లి, పెరికేగూడెం, లింగాల మరియు కానుకొల్లు గ్రామాలలో నరేగా నిధులుతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు NDA నాయకులుతో కలిసి భూమిపూజ చేసారు. ఈ సందర్బంగా కామినేని గారు మాట్లాడుతు కూటమి సర్కార్ ఆంధ్రను అభివృద్ధి పధంలో పరుగులు పెట్టిస్తుందని హర్షం వ్యక్తం చేసారు. ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖకు అందుతున్నాయి కాబట్టే అభివృద్ధిలో ఎక్కడా రాజి పడటం లేదని తెలిపారు. ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి తో అద్భుతమైన పాలన అందించటం ఒక్క NDA కూటమికే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్న.