ఏలూరు, మార్చి 12: స్థానిక డిసియంఎస్ ఫంక్షను హాల్లో గురువారం ఉమ్మడి రైతులు అభివృద్ధి, సంక్షేమానికి, సహకార రంగాలను మరింత బలోపేతం చేస్తాము*
*ప్రతీ రైతుకు గిట్టుబాటు ధర అందిస్తాం*
*ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించి, ఆరోగ్య సమాజం ను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది
*మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు మేలు చేస్తాం*
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ లిమిటెడ్, మహాజన సభ సమావేశమునకు డిసియంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు ...
పశ్చిమగోదావరి జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ లిమిటెడ్, మహాజన సభ సమావేశమునకు డిసియంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. సంఘము యొక్క 2026-27 ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన అంచనా బడ్జెటును, సంఘపు నాన్ ఆఫిసియల్ పర్సన్ ఇంచార్చి చైర్మన్ అనుమతితో ప్రవేశపెట్టబడిన ఇతర అంశములు ఆమోదించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా సహకార మార్కెటింగు సొసైటీ లిమిటెడ్ మహాజన సభలో పాల్గొనుటలో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ ప్రభుత్వం సహకార సంఘాలు పురోభివృద్ధిలో ఉండేలా కృషి చేసిందన్నారు. కాన్స్ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు సహకార రంగాలు వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. దశలు వారీగా ఉన్న సమస్యలు అధిగమించి, నష్టాలు నుండి లాభాలు బాటలో పయనించేలా సహకార సంఘాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. యుపిఏ సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కమర్షియల్ బ్యాంకులతో పోటీలో నిలబడుతూ, రైతులకు మంచి మేలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు. సహకార రంగాలు రైతులు అభివృద్ధికి బలమైన ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, రైతులు సేంద్రియ వ్యవసాయంతో పండించిన వివిధ రకాలు పంటలు, అపరాలు, అవసరమైన మార్కెటింగు సౌకర్యాలు, ఆర్థిక సహాయం మరియు ఇతర సేవలను అందించడంలో సహకార సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మేధావులు, పర్యావరణ వేత్తలు, రైతు సంఘాలు నాయకులు, రైతులు సలహాలు, సూచనలను స్వీకరించి సొసైటీ అధికారులు, అధ్యక్షులు సహకారంతో సహకార సంఘాలు మరింత అభివృద్ధి చేసి మంచి సేవలు అందిస్తామని తెలిపారు.
డిసియంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) మాట్లాడుతూ రైతులు సంక్షేమం, అభివృద్ధి మరియు సహకార రంగాలు మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా రైతులకు గిట్టుబాటు ధర పొందేలా రైతులకు అవగాహన సదస్సులు ద్వారా తెలియజేస్తామని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, అపరాలు కొనుగోలు ఉన్నాయని అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని రైతులు కోరికను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న రైతులకు కూడా మేలు జరిగేలా చూస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించి, ఆరోగ్య సమాజాలుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉందని, ఈ దిశగా ముందుకు అడుగులు వేస్తామని అన్నారు. యుపిఏ సేవలు ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, క్యూ ఆర్ కోడ్ లు , వాట్సాఫ్ సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కమర్షియల్ బ్యాంకులతో పోటీలో నిలబడుతూ, రైతులకు మంచి మేలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో సొసైటీ ప్రగతి, రైతులకు అందిస్తున్న సేవలు, భవిషత్తు కార్యాచరణ వంటి అంశాలుపై చర్చించామని అన్నారు. రైతులు అభివృద్ధి మరియు సహకారరంగం బలోపేతం కోసం సొసైటీలు మరింత కృషి చేసేలా కార్యాచరణ రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. రైతులకు అవసరమైన సహాయ,సహకారాలు అందిస్తూ, వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషించేలా, పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో డిసివో అరిమిల్లి శ్రీనివాసు, డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి కె.సత్యవతి, బిజినెస్ మేనేజరు ఇంచార్చి వెల్లంకి శివకృష్ణ మోహన్, ప్రముఖ పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ, మాజీ డిసియంఎస్ చైర్మన్ నడింపల్లి సత్యనారాయణ రాజు, పాలకోడేరు కోపరేటివ్ సోసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, సహకార సంఘాలు అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, కార్యదర్శులు, బిజినెస్ మేనేజర్లు, డిసియంఎస్, డిసిసిబి ఉద్యోగులు, సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

