అమరావతి విజయ హాసం
దెందులూరు 31.03.2026- "పోలీస్ ఉద్యోగం అంటేనే నిత్యం విశ్రాంతి లేకుండా ఎన్నో సవాళ్లు, వత్తిళ్లు, శారీరక మానసిక శ్రమను ఎదుర్కోవటం - అలాంటి విధి నిర్వహణలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించటం మరెంతో అభినందనీయం": ఎస్పీ(నాన్ క్యాడర్ ) గా ఉద్యోగఉన్నతి పొందిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా. సూర్యచంద్రరావు గారికి అభినందనలు తెలిపిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు..ఏలూరు జిల్లా బాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన ప్రమోషన్స్ లో భాగంగా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ( నాన్ క్యాడర్గా) ఉద్యోగఉన్నతి పొందిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పి నక్కా సూర్యచంద్రరావు గారు దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చము అందించి శాలువాతో సత్కరించారు..ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి మాట్లాడుతూ పోలీస్ విధి నిర్వహణలో ఎంతో అంకితభావంతో పనిచేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్థాయి నుంచి ఈనాడు ఎస్పీ సాయి వరకు నక్క సూర్యచంద్రరావు గారు ఎదగడం ఎంతో అభినందనీయమని, ఆయన సర్వీసు తొలినాళ్లలో తమ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి స్టేషన్ లో కూడా సూర్యచంద్రరావు గారు పోలీస్ అధికారిగా విధులు నిర్వహించారని, గ్రామాల్లో ఏదైన వివాదాలు, సమస్యలు ఏర్పడినప్పుడు వాటిపై ఒక పోలీస్ అధికారిగా మాత్రమే కాకుండా మానవత్వంతో కూడా ఆలోచిస్తూ ఇరు పక్షాల వారికి అవగాహన కల్పించటం ద్వారా నక్క సూర్యచంద్రరావు గారు విధులు నిర్వర్తించేవారని, అదేవిధంగా తన సుదీర్ఘ పోలీస్ సేవలు ప్రస్థానంలో ఎంతోమంది కిందిస్థాయి సిబ్బంది వద్ద ఈనాటికి ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారని, పదోన్నతిలో భాగంగా విజయవాడ నగర ట్రాఫిక్ విభాగానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వెళుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు...
