ఏలూరు, మార్చి , 10 : జిల్లాలోని ఇంజనీరింగ్, తదితర శాఖల ద్వారా వసూలు కావలసిన జీఎస్టీ వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇంజనీరింగ్, తదితర శాఖల ద్వారా చెల్లించిన బిల్లులకు సంబంధించి వసూలు కావలసిన జీఎస్టీ వివరాలపై మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు, రహదారులు భవనాలు, గృహ నిర్మాణ, ఆర్ డబ్ల్యూ ఎస్., పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, తదితర ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించిన కాంట్రాక్టు ఏజెన్సీ ల వివరాలు, చెల్లించిన బిల్లులు, జీఎస్టీ బకాయిల వివరాలను వెంటనే వాణిజ్య శాఖ పన్నుల అధికారులకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల నుండి వసువులు చేసిన వృత్తి పన్నుల వివరాలు కూడా వెంటనే సమర్పించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జీఎస్టీ అమలులోనికి ముందు జిల్లాలో వివిధ సంస్థల నుండి వసూలుచేయవలసిన 70. 31 లక్షల రూపాయల బకాయిలు కూడా వసూలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, రహదారులు భవనాలు, గృహ నిర్మాణ, ఆర్ డబ్ల్యూ ఎస్., పంచాయతీ రాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------
(జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది.)

