*ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి సుస్మిత ఆర్, ఐపీఎస్ గారి ఆదేశాల పై చింతల పూడి ఇన్స్పెక్టర్ శ్రీ క్రాంతి కుమార్, ధర్మాజీ గూడెం ఎస్ఐ శ్రీ వెంకన్న గారు లింగ పాలెం మండలంలోని ఎరువుల వ్యాపారుల తో నిర్వహించిన అవగాహన సదస్సు ను నిర్వహించినారు*
👉రైతుల సంక్షేమం మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, లింగ పాలెం మండలంలోని ఎరువులు మరియు పురుగుమందుల దుకాణదారు లతో స్థానిక పోలీస్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
👉ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులకు ఈ క్రింది నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
👉ప్రజల నుండి లేదా రైతుల నుండి ఎలాంటి అనధికారిక నగదు డిపాజిట్లు సేకరించ కూడదు.
👉 నాణ్యత లేని లేదా నకిలీ ఎరువులను విక్రయించి రైతులను మోసం చేయకూడదు. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
👉 ప్రభుత్వం నిషేధించిన పురుగు మందులు లేదా రసాయనాలను స్టాక్ ఉంచడం గానీ, విక్రయించడం గానీ చేయకూడదు.
👉 ఎట్టి పరిస్థితు ల్లోనూ మైనర్లకు చిన్నపిల్లలకు ఎరువులు లేదా పురుగు మందులను అమ్మకూడదు.
👉 ఎవరైనా వ్యక్తి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించినా, లేదా బాధలో ఉండి పురుగుమందులు అడుగు తున్నట్లు గమనించినా.. వారికి మందులు విక్రయించ కుండా వారించడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించాలి. అలాంటి అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
👉రహదారి భద్రతపై అవగాహన
కేవలం వ్యాపారమే కాకుండా, సామాజిక బాధ్యతగా రహదారి భద్రతను పాటించాలని అధికారులు కోరారు.
👉ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపే టప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
👉రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.
👉 ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ జారీ చేసిన ఈ ఆదేశాలను ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.

