Ticker

6/recent/ticker-posts

ఏలూరులో అత్యా ధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనం ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత గారు*

 






*ఏలూరులో అత్యా ధునిక హంగులతో నిర్మించిన  మహిళా పోలీస్ స్టేషన్ భవనం ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు  వంగల పూడి అనిత గారు*

👉మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ, భవిష్యత్ అవసరాలకు అను గుణంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యా లయ ప్రాంగణం నకు అతి సమీపములో నిర్మించిన నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి వంగల పూడి అనిత గారు ఈ రోజు అనగా 09.04. 2026 ప్రారంభించారు.

👉సుమారు 30 సెంట్ల విస్తీర్ణంలో, 2 కోట్ల 73 లక్షల రూపాయల భారీ వ్యయంతో అన్ని రకాల హంగులతో ఈ రెండం తస్తుల భవనాన్ని నిర్మించారు.

👉 భవనము లో శిశు సంరక్షణ కేంద్రం  స్టేషన్‌ కు వచ్చే మహిళలతో పాటు వారి చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 'చిల్డ్రన్స్ ప్లే ఏరియా' మరియు అవసరమైన సదుపాయాలను కల్పించడం ఈ భవనం యొక్క ప్రత్యేకత.

👉ఆధునిక వసతులు మహిళా మరియు పురుష సిబ్బంది కోసం విడివిడిగా అత్యా ధునిక బేరాకులు.

విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ మరియు సమావేశ మందిరాలు.

సురక్షితమైన లాకప్ గదులు మరియు సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్.

సాంకేతికత భావితరాల అవసరాలకు తగ్గట్టు గా, పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా నెట్‌వర్కింగ్ మరియు డిజిటల్ సదుపాయా లను ఇక్కడ ఏర్పాటు చేశారు.

👉 ఈ సందర్భంగా హోం మంత్రి గారు మాట్లాడుతూ ఈ రోజు పెదపాడు ను ప్రారంభిం చినట్లు ముందుగా నిర్వ హించిన పోలీస్ స్టేషన్ యొక్క స్థితి గతులను చూసి తాను ఎంతో ఆవేదన చెంది నట్లు అటువంటి వసతులు లేనటువంటి ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేసినటు వంటి ఆ పోలీస్ స్టేషన్ అధికారులను అభినందించినారు.

👉 మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా, వారికి స్నేహ పూర్వక వాతావరణం కల్పించడమే, మహిళలకు ఏదైనా కష్టం సంభవించిన యెడల పుట్టింటికి వెళ్లి ఏ విధముగా వారి యొక్క సమస్యలను తెలియ చేసుకుంటారో అదే విధమైనటు వంటి అదే విధముగా మహిళా పోలీస్ స్టేషన్ కి మహిళలు వచ్చి వారి బాధలను తెలియచేసుకునేలాగా  ఈ నూతన భవన లక్ష్యమని పేర్కొన్నారు.

 👉 అత్యాధునిక వసతులతో కూడిన ఇటువంటి భవనాలు పోలీస్ సేవల నాణ్యతను మరింత పెంచుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 *ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు ప్రత్యేకం గా తయారు చేయ బడిన షీ బాక్స్ ను ప్రారంభించిన ఈ సందర్భంగా షి బాక్స్ ను గురించి తెలియ జేస్తూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వారి యొక్క సమస్యలను తెలియజేసుకోలేనటువంటి మహిళల కొరకు ధర్మా యాప్ న్యాయ సహాయకు ద్వారా వారి యొక్క సమస్యను ఈ షీ బాక్స్ వద్ద వాయిస్ రికార్డ్ చేసిన వెంటనే సంబంధిత అధికారు లకు సదరు రిపోర్టును తన అంతట తానుగా రూపొందించి సంబం ధిత అధికారులకు తెలియజేయడం జరు గుతుందని ఇటువంటి  వినూత్న  కార్యక్రమా లను రూపొందిం చడంలో ఏలూరు జిల్లా ఎస్పీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నోసార్లు ప్రసంచినారని, రానున్న కాలంలో మెరుగైన సేవలను అందించుటలో ఏలూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నదని, 


👉 ఏలూరు జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏలూరు జిల్లాని ఎంపిక చేయడం జరిగిందని నేర నియంత్రణ కొరకు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నారని అభినందించినారు.


ఈ కార్యక్రమంలో మంత్రిగారితోపాటుగా ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి గంట పద్మ గారు, ఏలూరు మున్సిపల్ చైర్మన్ నూర్జహాన్ గారు,  ఏలూరు రేంజ్ ఐజి శ్రీ జి వి జి అశోక్ కుమార్ ఐపీఎస్ వారు, ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెట్రీ సెల్వి ఐఏఎస్ వారు, జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐ.పి.ఎస్., ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ గారు జంగారెడ్డిగూడెం ఏ ఎస్ పి శ్రీమతి సుష్మిత ఆర్ ఐ పీ ఎస్ వారు, ఏలూరు డీఎస్పీ శ్రీ డి శ్రావణ్ కుమార్ గారు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ యు రవి చంద్ర గారు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

నూతన భవనాన్ని పరిశీలించిన అనంతరం హోం మంత్రి గారు పోలీసుల పనితీరును అభినందించారు.

అనంతరం ఏలూరు ట్రాఫిక్ క్రాస్ రోడ్ పార్కును మంత్రివర్యులు సందర్శిం చినారు సదరు పార్కులో విద్యార్థినీ విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేయించిన జిల్లా ఎస్పీ గారిని మంత్రివర్యులు అభినందించినారు.