Ticker

6/recent/ticker-posts

రాష్ట్ర గవర్నరు శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం*.

 





          పోలవరం/ ఏలూరు, ఏప్రియల్ 02: పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా గురువారం హెలికాఫ్టర్ లో పోలవరం చేరుకున్న రాష్ట్ర గవర్నరు శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా.నిమ్మల రామానాయుడు,  పుష్పగుచ్చాలతో రాష్ట్ర గవర్నరుకు ఘనంగా  స్వాగతం  పలికారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు రాష్ట్ర గవర్నరుకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. 

పోలవరం ప్రాజెక్టు అడ్మిని స్ట్రేటరు & ఎక్స్ అఫీషియో జాయింటు కలెక్టరు వి. అభిషేక్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, ఏఎస్పీ లు ఆర్.సుస్మిత, జయాశర్మ, డి.హేమంత్, పంకజ్ కుమార్ మీనా, జి.మునిరాజు, ఆర్డీవో యం.వి. రమణ, జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీప్ రెడ్డి, ఐటిడిఏ పీవో కె.రాములు నాయక్, మెగా సంస్థ ప్రతినిధులు, ఇంజనీరింగు ప్రతినిధులు, తదితర ప్రభృతులు ఉన్నారు.