Ticker

6/recent/ticker-posts

:ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వితొ కలిసి పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు....*

 


, అమరావతి విజయహాసం :ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు నిర్వహిస్తున్న PGRS కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వితొ కలిసి పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు....*

*మండలంలో వివిధ గ్రామాల నుండి పలు సమస్యల నిమిత్తం విచ్చేసిన ప్రజాల సమస్యలు తెలుసుకొని, వారి నుండి వినతులను స్వీకరించిన కలెక్టర్  వెట్రి సెల్వి ఎమ్మెల్యేధర్మరాజు ...

ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల స్థాయిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు  పత్సమట్ల ధర్మరాజు  పాల్గొన్నారు

ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల వినతులను కలెక్టర్ వెట్రిసెల్వి , ఎమ్మెల్యే ధర్మరాజు స్వీకరించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, కొత్త పెన్షన్లకు సంబంధించిన పలు అభ్యర్థనలను స్వీకరించారు.

అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు  మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతంగా, ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం PGRS కార్యక్రమాన్ని మండల స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, మండల రెవెన్యూ అధికారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు.