ఏలూరు, మార్చి 11, జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరు నుండి బుధవారం జిల్లాలో గ్యాసు సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ స్పష్టం చేశారు.
- ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాలకు మరియు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు వినియోగించే వంట గ్యాసు సిలిండర్ల కొరత ఏమాత్రం లేదని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో గ్యాసు సిలిండర్ల సరఫరా మరియు డిమాండు మధ్య సమతుల్యత సక్రమంగా ఉందని, గృహ వినియోగ దారులకు డొమెస్టిక్ గ్యాసు సిలిండర్ల పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా యధావిధిగా కొనసాగుతోందని తెలిపారు. గ్యాసు ఏజెన్సీలు వద్ద తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాలకు (Welfare Hostels) అవసరమైన గ్యాసు సిలిండర్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడం లేదని అన్నారు. విద్యార్ధులకు భోజన సదుపాయంలో ఇబ్బంది రాకుండా గ్యాసు సరఫరాను పౌరసరఫరాలు శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు అవసరాలకు మరియు డిమాండుకు తగినట్లుగానే ఆయిల్ కంపెనీలు నుండి గ్యాసు సరఫరా క్రమం తప్పకుండా జరుగుతోందని అన్నారు. జిల్లాలో గ్యాసు కొరత ఉందంటూ వచ్చే ఎలాంటి వదంతులను, అపోహలను ప్రజలు నమ్మవద్దని, అనవసరంగా భయాందోళనలకు గురై వంట గ్యాస్ చేయవద్దన్నారు. గ్యాసు బుకింగు లేదా డెలివరీకి సంబంధించి వినియోగ దారులకు లేదా వసతి గృహాలు నిర్వాహకులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, వెంటనే సంబంధిత మండల తహశీల్దారు లేదా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టికి తీసుకురావాలని జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- ..........................................................
- జిల్లా సమాచార శాఖ, ఏలూరు నుండి జారీ చేయడమైనది.

