కైకలూరు, అమరావతి విజయహాసం :ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు ముదినేపల్లి మండలం దాకరం గ్రామములో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహం, తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ, ఎన్టీఆర్ పార్క్, ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల సైకిల్ స్టాండ్ షెడ్డు, గ్రామములో నూతన బస్సు షెల్టర్ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


