అమరావతి విజయ హాసం
ఏలూరు జిల్లా, అమరావతి విజయహాసం :లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో విజ్ఞాన భారతిఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 1st యానివర్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు*
*విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కస్పాండెంట్ కూచిపూడి మురళీకృష్ణ మాట్లాడుతూ పిల్లలకి మెరుగైన విద్యను స్పోకెన్ ఇంగ్లీష్ తో విద్యని బోధించడం కోసం మంచి ఫ్యాకల్టీని తీసుకున్నాము మా వంతుగా పిల్లలను బాగా చదివిస్తున్నాము పేరెంట్స్ కూడా పిల్లల పట్ల శ్రద్ధ చూపాలని అప్పుడే పిల్లలు బాగా చదివి అభివృద్ధి చెందుతారని తెలియపరిచారు*
అమరావతి విజయహాసం :*2025-2026 ఈ సంవత్సర కాలంలో మెరిట్ స్టూడెంట్స్ కి బహుమతులు ప్రశంస పత్రములు మెడల్స్ పిల్లలకు బహుకరించటం జరిగింది*
*విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చక్కగా నృత్యాలతో క్యాట్ వాక్కులతో ఎంతగానో అలరించారు*
*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగగూడెం పంచాయతీ సర్పంచ్ బొంతు రాంబాబు, సింగ గూడెం పంచాయతీ గ్రామ పార్టీ అధ్యక్షులు బొంతు శ్రీను, దళిత సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాకొల్లు స్టాలిన్, పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు వీరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు*
*విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా బహుమతులు అందజేశారు సెలబ్రేషన్ తర్వాత విద్యార్థిని విద్యార్థులకు అతిథులకు పేరెంట్స్ కు విజ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం వారు ప్రేమతో విందు ఏర్పాటు చేయడం జరిగింది*

